JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో గణనీయమైన ఆదాయం నమోదైంది. వివిధ సేవలు, టికెట్లు, ప్రసాదాల విక్రయాల ద్వారా మొత్తం రూ. 6,45,396 ఆదాయం సమకూరింది. ఇందులో టికెట్ల ద్వారా రూ. 83,026, ప్రసాదాల ద్వారా రూ. 5,51,500, అన్నదానం ద్వారా రూ. 10,870 లభించాయి. ప్రసాదాల విక్రయాలే ప్రధాన ఆదాయ వనరుగా నిలిచాయి.