PDPL: ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో రూ. 10 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు సర్పంచ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విడతల వారీగా గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి నందు లాల్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.