AP: పోలీస్ శాఖ ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేయదని కృష్ణా జిల్లా పోలీస్ అధికారుల సంఘం స్పష్టంచేసింది. ‘మీరు చేసే పనులకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ’ అంటూ పేర్ని నాని కుమారుడు కిట్టు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపింది. అక్రమ కట్టడం కూల్చివేసే సమయంలో భద్రత కల్పించాలని మున్సిపల్ కమిషనర్ కోరడంతోనే ఘటనాస్థలిలో ఉన్నట్లు పేర్కొంది.