VKB: జిల్లాలో LPG గ్యాస్ సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడి గృహ వినియోగదారులకు, హోటళ్లకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో, డొమెస్టిక్ గ్యాస్ బండల ధరలు బ్లాక్ మార్కెట్లో విపరీతంగా పెరిగాయని హోటల్ నిర్వాహకులు తెలిపారు. హోటళ్లు మూసివేస్తే జీవనోపాధికి కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.