TG: HYD ప్రజాభవన్‌లో జరిగే సీఎం ప్రజావాణి కార్యక్రమం ఇవాళ రద్దు చేశారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా సీఎం ప్రజావాణి కార్యక్రమానికి సెలవు ప్రకటించినట్లు ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి దివ్య తెలిపారు. తిరిగి ఈనెల 7న ప్రజావాణి ప్రారంభం కానున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లాల నుంచి ప్రజలు ఫిర్యాదులు అందించడానికి ప్రజాభవన్‌కు రావొద్దని సూచించారు.