కాకినాడ: శంఖవరం మండల ప్రజా పరిషత్తుకు కొత్త అభివృద్ధి అధికారిగా యు.నాగేంద్ర గురువారం విధుల్లో చేరారు. బుధవారం వరకూ ఈయన కోనసీమ జిల్లా అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లవరం మండల ప్రజా పరిషత్తు కార్యాలయం డిప్యూటీ ఎంపీడీవోగా విధులను నిర్వహించారు. ఎంపీడీఓగా పదోన్నతి పొంది అక్కడ నుంచి బదిలీపై శంఖవరం మండలానికి వచ్చి ఎంపీడీవోగా బాధ్యతలను స్వీకరించారు.