VKB: కిరాణా షాపుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే రూ. 50,000ల జరిమానా విధిస్తామని నవాబ్‌పేట మండలం కుమ్మరిగూడ గ్రామపంచాయతీ హెచ్చరించింది. గ్రామసభలో వచ్చిన ప్రజల ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి ఈ మేరకు నోటీసు గురువారం జారీ చేశారు. మద్యం అమ్మడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.