ASR: పెదబయలు మండలం బొండపల్లి పంచాయతీ గొడ్డిపుట్టు గ్రామంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. గొడ్డిపుట్టు గ్రామంలో రీ-సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుపుస్తకాలను ఆర్డీవో లోకేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన 48 పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.