ప్రకాశం: కందుకూరు చెందిన మాధవరావుకు రవీందర్ నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా, నగదు ఇవ్వాలని అడగాడు. రవీంద్ర స్పందించకపోవడంతో మనస్థాపం చెంది చనిపోతానని బంధువులకు ఓ వీడియో పంపాడు. వారు పోలీస్ కమాండో కంట్రోల్‌కి సమాచారం ఇవ్వగా, స్పందించిన సీఐ అజరత్తయ్య వెంటనే మాధవరావు ఫోన్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరులో ఉన్నట్టు గుర్తించి బంధువులకు అప్పచెప్పినట్లు వెల్లడించారు.