SRPT: సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో మీసేవ ఆన్లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం కలుగుతుందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 3న సాయంత్రం అయిదు గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు, సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం దీన్ని చేపడుతున్నారని తెలిపారు.