VZM: మునిసిపల్ కమీషనర్ బాలస్వామి గురువారం తన కార్యాలయంలో సచివాలయం అడ్మిన్, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలను ఒప్పించి పన్నులు వసూలు చేయాలని అన్నారు. పన్నులు వసూలు చేసేటప్పుడు ప్రజలకు అవగాహన కల్పించి పన్నువిధింపులు చేపట్టాలన్నారు. పన్నులు చెల్లింపులో ఉన్న 50% రాయితీని విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.