AP: రాష్ట్రమంతా అమరావతికి మద్దతు తెలుపుతుంటే, జగన్ తెచ్చిన ‘మావిగన్’ ప్రతిపాదన చూసి జనం నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. జగన్ తన వింత ప్రతిపాదనలతో ట్రోల్స్‌కు సరకు అందిస్తూ, ఒక ఆస్థాన విదూషకుడిలా మారిపోయారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి ఇటువంటి హాస్యాస్పదమైన అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.