AP: శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘3 రాజధానుల బిల్లు సమయంలో ఓ మంత్రి నాపై చేయి చేసుకున్నారు. మరో మంత్రి దూషించారు. మండలినే రద్దు చేస్తామని వైసీపీ సభ్యులు బెదిరించారు. నాకున్న అధికారంతో 3 రాజధానుల బిల్లును ఆమోదించలేదు. ఎన్ని బెదిరింపులొచ్చినా.. ధర్మం వైపు నిలబడ్డాను. ఇప్పుడు అమరావతిని రాజధానిగా చట్టం చేస్తుండటం సంతోషంగా ఉంది’ అని షరీఫ్ అన్నారు.