PDPL: వేసవి కాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని DMHO డా.ప్రమోద్ కుమార్ సూచించారు. ఉ. 11 నుంచి సా. 4 గంటల మధ్య బయటికి వెళ్లరాదని, తెల్లటి దుస్తులు ధరించాలని తెలిపారు. ఆల్కహాల్, టీ, కాఫీ, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలని, తరచూ నీరు తాగుతూ ఉండాలని పేర్కొన్నారు. ప్రయాణాల సమయంలో నీరు, ORS వెంట తీసుకెళ్లాలన్నారు.