AP: తిరుపతి బాలాయపల్లి మండలం మేల్చూరు వద్ద బస్సు దగ్ధమైంది. ఓ ప్రైవేట్ బస్సును బైక్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. బస్సు కిందకు బైక్ వెళ్లడంతో పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.