PLD: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం గ్రామంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ రైతులకు పశువుల ఆరోగ్యం, సంరక్షణపై అవగాహన కల్పించారు. పశువులు ఆరోగ్యంగా ఉంటేనే రైతు కుటుంబం ఆర్థికంగా బలపడుతుందని తెలిపారు.