SRCL: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో వంగ హారిక ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాగా, గృహ ప్రవేశ వేడుకకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారుకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రొండి రాజు, వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పాల్గొన్నారు.