Bomb threats to Delhi University's Ramlal Anand College
Bomb Threat: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్బలో బాంబు పేలిన తరువాత భారత దేశంలోని ప్రధాన నగరాలు అలెర్ట్ అయ్యాయి. అయినా సరే బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్స్, మెయిల్స్ కలకలం వస్తున్నాయి. తాగా ఢిల్లీలోని ఓ బాంబు బెదిరింపు కాలు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీలోని (University of Delhi) రామ్ లాల్ ఆనంద్ కళాశాల (Ram Lal Anand College)కు ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గురువారం ఉదయం 9:34 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కళాశాలలో బాంబు పెట్టినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
కళాశాలకు చేరుకున్న పోలీసులు విద్యార్థులు, సిబ్బందిని సేఫ్గా బయటకు పంపించేశారు. అనంతరం బాంబ్ స్వ్కాడ్ సాయంతో (Bomb Disposal Squad) కళాశాల ఆవరణలో తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. దీంతో అందరూ ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇది ఎవరు చేశారు అనేది తెలియదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొంత కాలంగా దేశంలోని పలువురు వ్యక్తులు, పలు నగరాలు, పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి.