Tamilnadu : ఇటీవల బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సృష్టించిన గందరగోళం మనందరం చూశాం. ఈ ఘటనతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడులోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురంలో సోమవారం (మార్చి 4) అంటే ఈరోజు ఈ రెండు ప్రాంతాల్లోని ఉన్నత పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
దీంతో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రులు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం మెయిల్ ద్వారా ఒక బెదిరింపు రాగా, సోమవారం ఉదయం మరో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రెండు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేస్తున్నారు?, నిజంగానే బాంబులు పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ బెదిరింపులు చేశారా?, లేకుంటే ఆకతాయిలు ఎవరైనా చేశారా అనేది తెలియాల్సి ఉంది.