WNP: బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఆదర్శవంతమైనదని ఆయన చూపిన అడుగుజాడల్లో నడవాలని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. గురువారం జిల్లా బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ.డీ.వో.సీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. గౌడ కులస్తులు సమైక్యంగా ఉండి పాపన్న సూచించిన అడుగుజాడల్లో నడవాలన్నారు.