VZM: జిల్లా కలెక్టర్ ఎస్. రాం సుందర్ రెడ్డి గురువారం గజపతినగరం రెండో నంబర్ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు తీరును పరిశీలించిన కలెక్టర్, విధులకు ఆలస్యంగా వచ్చిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించని సిబ్బందికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంపీడీఓను ఆదేశించారు.