GNTR: రాజ్యసభలో ఇవాళ అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించనుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి ఐదేళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు ‘మావిగన్’ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. అమరావతి పట్ల జగన్కు ఉన్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని దుయ్యబట్టారు. అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరని, అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారన్నారు.