TG: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ నేత శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. అవినీతికి పాల్పడలేదని బీరంగూడ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీరంగూడ ఆలయానికి శ్రీనివాస్ గౌడ్ వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఆయన్ని హౌస్ అరెస్టు చేశారు.