TPT: జలజీవన్ మిషన్ పథకం కింద నియోజకవర్గంలో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉన్న పంచాయతీల అభివృద్ధి కోసం సింగిల్ విలేజ్ స్కీమ్ ద్వారా రూ.11 కోట్ల 49 లక్షల 51 వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాధాలు తెలిపారు.