KMM: బైక్ను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో బుధవారం సాయంత్రం ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందారు. హైదరాబాద్లో పనిచేస్తున్న నంబి ఫణిందర్(31)తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో ఖమ్మం వెళ్తుండగా కొనిజర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఫణిందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సూరజ్ కేసు నమోదు చేశారు.