SKLM: కవిటి మండలం జగతి ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం గురువారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పలాస విద్యుత్తు శాఖ ఈఈ యజ్ఞేశ్వరరావు బుధవారం తెలిపారు. ఈ మేరకు జగతి పంచాయతీలోని గ్రామాలకు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని, గృహ, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని కోరారు.