MBNR: గండీడ్ రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి, CMRF చెక్కులను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వెన్నచేడ్ గ్రామానికి చెందిన ముంగిమల్ల మంగమ్మ, ఒగ్గు నాగమణి, ముస్తి సుజాత, కందనపల్లి శ్రీనివాస్ చెక్కులు అందుకున్నారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.