ప్రకాశం: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ కనిగిరి పట్టణంలో బుధవారం సాయంత్రం కార్మిక శ్రేణులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు సంఘం జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు కేశవరావు మాట్లాడుతూ.. కార్మికులకు నష్టాన్ని కలిగించే లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.