SS: పుట్టపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన రెవెన్యూ భవనాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, మంత్రి సవిత బుధవారం ప్రారంభించారు. మంత్రులు మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ భవనం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అధికారులు ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు.