MBNR: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే శోభాయాత్రలు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని DSP వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం శోభయాత్ర నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు నిర్దేశించిన రోడ్డు మార్గంలోనే శోభాయాత్ర నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎటువంటి గొడవలు జరగవద్దని సూచించారు.