NZB: అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా ఎదిగానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అయ్యప్ప జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడూతూ.. ఇందూరు అయ్యప్ప ఎంతో మహిమాన్ముతుడని, కొలిచిన వారికి అండగా నిలుస్తాడని తెలిపారు.