సోషల్ మీడియాలో ఉన్నట్టుండి తుఫాన్ వచ్చినట్టుగా ఓ రేంజ్లో బోల్డ్‌గా రెచ్చిపోతోంది సమంత. లేటెస్ట్గా బికనీ ఫోటో షేర్ కిర్రెక్కించింది. అయితే.. సామ్ ఇలా ఎందుకు రెచ్చిపోతోంది? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Samantha: ఈ మధ్య సినిమాల కంటే, సోషల్ మీడియాలోనే ఎక్కువ సందడి చేస్తోంది సమంత. నిన్నటికి నిన్న ఇన్‌స్టాలో చైనీస్ బొమ్మలా చేసిన ఫీట్ ఫొటోను పోస్ట్ చేస్తూ.. తన వెయిట్ 50 కేజీలు, మెటబాలిక్ ఏజ్ 23 అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇక ఇప్పుడు సామ్ బికినీలో సెగలు రేపేలా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సమంతను బికినీలో చూసి వావ్ అంటున్నారు ఆమె అభినులు. రకరకాలా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అయితే.. సమంత ఎందుకిలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది? అనేదే హాట్ టాపిక్‌గా మారింది. మయో సైటిస్ బారిన పడిన తర్వాత.. దాదాపుగా ఇప్పుడు నార్మల్ కండీషన్‌కు వచ్చేసింది సామ్. ఆ విషయం చెప్పడానికే సామ్ గ్లామర్ ట్రీట్ ఇస్తోందని అంటున్నారు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు.
చదవండి:Operation Valentine: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి మెగాస్టార్!
సమంత ఎంత ఫిట్‌గా ఉన్నా.. గ్లామర్ ఒలకబోసినా.. అమ్మడి చేతిలో మాత్రం ఒక్క సినిమా కూడా లేదు. ముఖ్యంగా తెలుగులో సమంతను పట్టించుకునే వారే లేరు. ఖుషి సినిమా తర్వాత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు సామ్. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఒక్కటే రిలీజ్‌కు రెడీ అవుతోంది. అందుకే.. ఆఫర్ల కోసం సామ్ ట్రై చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మయోసైటిస్ నుంచి కోలుకుని సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాను.. అంటూ సామ్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. అయినా కూడా సమంతను తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు. మయోసైటిస్ నుంచి కోలుకొని నెలలు గడుస్తున్నా ఒక్క ఆఫర్ రాకపోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అందుకే సామ్ బికినీ ఫోటో షేర్ చేసి.. దేనికైనా రెడీ అన్నట్టుగా ఫిల్మ్ మేకర్స్ సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది వ్యవహారం. మరి ఇప్పటికైనా సమంతకు అవకాశాలు వస్తాయా? లేదో చూడాలి.