NLG: హాలియా సర్కిల్ పరిధిలో పేకాట రాయుళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ ఆదేశాలతో సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేశారు. గతంలో పేకాడిన వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇకపై పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని, నేరుగా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.