»Uttarpradesh The Man Who Married Brothers Daughter What Did The Villagers Do
Uttarpradesh: అన్న కూతుర్ని పెళ్లిచేసుకున్న వ్యక్తి.. గ్రామస్తులు ఏం చేశారంటే
ఓ వ్యక్తి తన అన్నయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాడు. బంధాలను మర్చిపోయి, ఆచారాలను వదిలి కుటుంబ సమక్షంలోనే ఆ జంట హనుమాన్ ఆలయంలో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ రోజుల్లో ప్రేమ(Love) పేరుతో యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. బంధాలను కూడా మర్చిపోయి ప్రేమ పేరుతో తప్పటడుగులు వేస్తోంది. తాజాగా ఓ అమ్మాయి తన బాబాయ్‌ని ప్రేమించి పెళ్లి (Marriage) చేసుకుంది. వారి ప్రేమకు కుటుంబీకులు కూడా ఒప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh)లోని ఔన్‌పూర్ జిల్లా తాజుద్దీన్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన కూతురి వరసైన ఓ అమ్మాయిని వివాహం చేసుకోవడంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)కు చెందిన సుభమ్ (subham) అనే వ్యక్తి తన అన్న కూతురు రియా(Riya)ను ప్రేమించాడు. ఆమెకు గత మూడేళ్లుగా సుభమ్ను ప్రేమిస్తోంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్న విషయంలో ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు (Family Members) వారి ప్రేమకు అడ్డుచెప్పారు. అయితే సుభమ్, రియాలు ఇద్దరూ విడిపోలేమని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కుటుంబీకులు వారికి ప్రేమకు మొదట వ్యతిరేకత చూపిన ఆ తర్వాత పెళ్లికి అంగీకరించారు.
గ్రామంలోని హనుమాన్ దేవాలయం (Hanuman Temple)లో కుటుంబీకుల సమక్షంలోనే సుభమ్(Subham), రియా(Riya)లు వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి బంధంపై గ్రామస్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హిందూ ఆచారాలకు విరుద్దంగా అన్నయ్య కూతురును పెళ్లి(Marriage) చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులందరూ ఆ పెళ్లిని ఖండించినా సుభమ్, రియాలు మాత్రం పట్టించుకోలేదు. కుటుంబీకులు కూడా ఒప్పుకోవడంతో ఆనందంగా జీవిస్తున్నారు.