»The Thugs Who Intercepted The Procession And Kidnapped The Brideviral News %e0%b0%8a%e0%b0%b0%e0%b1%87%e0%b0%97%e0%b0%bf%e0%b0%82%e0%b0%aa%e0%b1%81%e0%b0%a8%e0%b1%81 %e0%b0%85%e0%b0%a1%e0%b1%8d
పెళ్ళి పీటల మీదనుంచి పెళ్లి కూతురును కిడ్నాప్ చేసిన ఘటనలు చూశాము కానీ ఇక్కడ పెళ్లి ఊరేగింపునుంచి నూతన వధువును కిడ్నాప్ చేశారు. కత్తులతో బెదిరించి వధువును ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది.
The thugs who intercepted the procession and kidnapped the bride
Viral News: సాధారణంగా పెళ్లి ఫిక్స్ అయిన తరువాత వివాహం ముందు లేదా కొంచెం డ్రామా అయితే పెళ్లిపీటల నుంచి వధువు కానీ, వరుడు కానీ వెళ్లిపోయిన సంఘటనలు, లేదా కిడ్నాప్ చేసిన ఘటనలు చూశాము. కానీ ఇక్కడ మాత్రం పెళ్లి సాఫీగా జరిగి ఊరేగింపులో ఈ ఘటన జరిగింది. భారత్ జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు కారును అడ్డగించి.. నవ వధువును ఎత్తుకెళ్లారు. ఈ దారుణ ఘటన గుజరాత్లోని దహోద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా వధువు ఆచూకీ మాత్రం పట్టుకోలేకపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం పెళ్లి తరువాత రాత్రి నూతన జంటను ఊరేగించారు. ఈ ఊరేగింపు నవగామ్కు చేరుకోగానే ఆయుదాలతో 15 మంది దుండగులు కారును అడ్డుకున్నారు. పెళ్లి కూతురు ఉష (22)ను కిడ్నాప్ చేశారు. వెంటనే వరుడు రోహిత్ అమలియార్ (23) పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కిడ్నాపర్లలో ఐదుగురిని గుర్తుపట్టిన రోహిత్ వారి వివరాలు అందించాడు. దాంతో ఈ ఘటనలో పాల్గొన్న వారిలో 8 మంది నిందితులను గుర్తించారు. అందులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా మహేశ్ భూరియాను గుర్తించారు. అయితే వధువు ఉష, మహేష్ భూరియా దూరం బంధువులని పేర్కొన్నారు. అయితే వీరి మధ్య పెళ్లికి ముందే ఎదైన సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. వధువు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.