మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు (Terrorists) ఉంటారు.. ఉన్నారు కూడా.. కానీ ఓ కోతి కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ (Criminals) లిస్టులో చేరిందంటే ఆశ్చర్యమే ! పైగా దాని తలపై రూ. 21 వేల రివార్డు సైతం ఉందంటే ఇంకా ఆశ్చర్యపోక తప్పదు. మధ్యప్రదేశ్ రాయ్ గఢ్ (Ray gaḍh) లో ఓ కోతి చేసిన దాడుల బీభత్సంతో దాన్ని ఎవరు పట్టి తెచ్చినా వారికి 21 వేల రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు అధికారులు. ఇళ్లపైన తిరుగుతూ 15 రోజులుగా ఈ కోతి (monkey) ముప్పుతిప్పలు పెట్టింది. ఎనిమిది మంది చిన్నారులు సహా మొత్తం 20 మంది ఈ కోతి దాడిలో గాయపడ్డారు. ఈ కోతిని బంధించేందుకు స్థానిక అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.
దీంతో కలెక్టర్ (Collector) చొరవతో ఉజ్జయిని అటవీ శాఖ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుని డ్రోన్ సాయంతో కోతిని చాకచక్యంగా బంధించారు. మత్తు వదిలిన తర్వాత కోతి కోపంతో రగిలిపోయింది. బోనులోంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈ కోతిని దట్టమైన అటవీ ప్రాంతం(Forest area)లో వదిలేస్తామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు.మనుషులపై దాడులు చేస్తూ రెండు వారాలుగా ముప్పు తిప్పలు పెట్టిన కోతిని అటవీఅధికారులు (Forest officials) ఎట్టకేలకు పట్టుకున్నారు. డ్రోన్ సాయంతో గాలించి, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోనులో పెట్టారు. వరుస దాడుల నేపథ్యంలో ఈ కోతిని బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేశారు.