»Ltte Chief Prabhakaran Alive Healthy Tamil Leaders Shocking Claim
LTTE Chief Prabhakaran Alive : ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ బతికే ఉన్నాడా..?
LTTE Chief Prabhakaran Alive : ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ బతికే ఉన్నాడా..? : ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పేరు అందరికీ సుపరిచితమే. ఆయన చనిపోయి ఉంటాడని గత కొంతకాలంగా అందరూ అనుకుంటున్నారు. అయితే... ఆయన చనిపోలేదని.. బతికే ఉన్నారంటూ... తమిళనాడు దేశీయ వాదం అధ్యక్షుడు నెడు మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ తన కుటుంబ సభ్యులతో ప్రస్తుతం కాంటాక్ట్ లో ఉన్నారంటూ ఆయన చెప్పడం గమనార్హం.
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పేరు అందరికీ సుపరిచితమే. ఆయన చనిపోయి ఉంటాడని గత కొంతకాలంగా అందరూ అనుకుంటున్నారు. అయితే… ఆయన చనిపోలేదని.. బతికే ఉన్నారంటూ… తమిళనాడు దేశీయ వాదం అధ్యక్షుడు నెడు మారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకరన్ తన కుటుంబ సభ్యులతో ప్రస్తుతం కాంటాక్ట్ లో ఉన్నారంటూ ఆయన చెప్పడం గమనార్హం. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారంటూ నెడు మారన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
2009లోనే ప్రభాకరణ్ మరణించాడనే ప్రపంచమంతా భావిస్తోంది. శ్రీలంక ఆర్మీ ప్రభాకరన్ చనిపోయినట్లు తెలిపింది. డీఎన్ఏ పరీక్షలు కూడా చేసి నిర్ధారణ చేశారు. అది జరిగి 14 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్ల తర్వాత ప్రభాకరన్ గురించి తెలిసిన వార్త అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితులు ప్రభాకరన్ కు అనుకూలంగా ఉన్నాయని, రాజపక్సే ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకత కారణంగా ప్రభాకరన్ తిరిగి రావడానికి ఇదే సరైన సమయమని నెడుమారన్ తెలిపారు. తమిళ ఈలంకి చెందిన సభ్యులకి ప్రభాకరన్ తన ప్రణాళికను త్వరలోనే తెలియజేస్తాడని కూడా నెడుమారన్ తెలిపారు. ప్రభాకరన్ ప్రస్తుతం తన భార్య, కుమార్తెతో కలిసి ఉంటున్నాడని, వారితో నేను టచ్ లోనే ఉన్నానని నెడుమారన్ తెలిపారు.