»British Womans Pet Dog Finds A Kidney Donor In Beach For Her And Saves Her Life
Kidney Donor యజమానికి పునర్జన్మ ప్రసాదించిన కుక్క
ఈ మాటలు విన్న లూసీకి నోట మాట రాలేదు. కిడ్నీ కోసం ఎక్కడెక్కడో వెతుకున్న తనకు ఇక్కడ లభించడంపై షాక్ కు గురైంది. కాగా ఇప్పుడు లూసీకి కిడ్నీ మార్పిడి పూర్తయ్యింది. పూర్తి ఆరోగ్యంగా ఉంది.
విశ్వాసానికి ప్రతీకగా శునకం (Dog) జాతి నిలుస్తుంది. యజమానులకు వెన్నంటి రక్షణగా నిలిచేవి కుక్క. వీటితో మనుషులకు (Human) అవినాభావ సంబంధం ఉంటుంది. వాటితో విడదీయలేని అనుబంధం (Relationship) ఏర్పడుతుంది. ఈ శునకాలు చాలాసార్లు తమ విశ్వాసాన్ని చూపించిన అనేక సంఘటనలు చూశాం. తాజాగా తమ పెంపుడు కుక్క వల్ల యజమానికి పునర్జన్మ లభించింది.
బ్రిటన్ (Britain)కు చెందిన లూసీ హంప్రే (Lucy Humphrey) (44) కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. 15 ఏళ్ల కిందట పరీక్షలు చేయగా.. కిడ్నీ మార్పిడి (Kidney) తప్పనిసరి అని వైద్యులు చెప్పారు. కిడ్నీ మార్చకుంటే (Transplant) ఆమె చనిపోతుందని వైద్యులు తెలిపారు. అయితే ఆమెకు తగిన కిడ్నీ అత్యంత అరుదైనది. లక్షల్లో ఒకరి వద్ద ఉంటుంది. ఆ కిడ్నీ కోసం చాలాచోట్ల వెతికారు. కానీ ఆమెకు నిరాశ ఎదురైంది. ఇటీవల తన ప్రియుడు కెనిడ్ ఒవెన్ (49)తో కలిసి సౌత్ వేల్స్ (South Wales)లోని బేరిలోనీ బీచ్ కు వెళ్లారు. అక్కడ సరదాగా సేద తీరుతుండగా లూసీ పెంపుడు కుక్క ఇండి అక్కడ నుంచి ఒక చోటకు చేరింది. అక్కడ ఉన్న మరో పర్యాటకురాలు కేటీ జేమ్స్ వద్దకు ఇండి కుక్క వెళ్లింది. ఆమెతో ఉండడాన్ని గుర్తించిన లూసీ వెంటనే అక్కడకు చేరుకుంది.
కుక్క అలా రావడంపై క్షమాపణ చెప్పి వెళ్తుండగా.. కేటీ జేమ్స్ (Katie James) మాట కలిపింది. మాటల మధ్యలో లూసీ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే తన అరుదైన కిడ్నీ (Rare Kidney) విషయం తెలిపింది. అయితే అరుదైన రకం కిడ్నీ తనదని.. నీకు ఇస్తానని కేటీ జేమ్స్ తెలిపింది. ఈ మాటలు విన్న లూసీకి నోట మాట రాలేదు. కిడ్నీ కోసం ఎక్కడెక్కడో వెతుకున్న తనకు ఇక్కడ లభించడంపై షాక్ కు గురైంది. కాగా ఇప్పుడు లూసీకి కిడ్నీ మార్పిడి పూర్తయ్యింది. పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా కేటీ జేమ్స్ కు లూసీ, ఆమె ప్రియుడు ధన్యవాదాలు చెప్పారు. కాగా, అరుదైన కిడ్నీ రకం గల మనిషిని గుర్తించడంలో లూసీ పెంపుడు కుక్క (Pet) ఇండి సహాయం చేసింది. తనకు పునర్జన్మ లభించడానికి కారణం ఇండి అని లూసీ తెలిపింది. ఈ సందర్భంగా లూసీని గాఢంగా ముద్దాడింది.