»Ias Rinku Resigned Her Job After Dog Walking At Ground
Pet డాగ్ కోసం గ్రౌండ్ క్లియర్.. ఊడిన ఐఏఎస్ అధికారి పోస్ట్
ఓ కలెక్టరమ్మా తన పెంపుడు కుక్క వాకింగ్ చేసేందుకు గ్రౌండ్లో ఉన్న ప్లేయర్లను ఇంటికి పంపేసింది. దీనిపై మీడియలో వార్తలు రావడం.. వీడియో ట్రోల్ అవడంతో సదరు కలెక్టరమ్మను కొలువు తీసేసింది కేంద్ర ప్రభుత్వం.
IAS Rinku Resigned Her Job After Dog Walking At Ground
IAS Rinku: అధికారం ఉంది కదా.. ఎలా పడితే అలా వాడితే చివరికీ ఉద్యోగం ఊడుతుంది. అవును.. ఓ కలెక్టరమ్మా.. తన పెంపుడు కుక్క వాకింగ్ కోసం ఏకంగా గ్రౌండ్‌నే క్లియర్ చేయించింది. క్రీడాకారులు బలవంతంగా బయటకు వచ్చేశారు. తర్వాత గమనిస్తే.. కలెక్టరమ్మ, ఆమె భర్త, కుక్క కలిసి గ్రౌండ్లో ఏం చక్కా వాకింగ్ చేశాయి. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి.. ఆమె చర్యలు తీసుకుంది. చివరికీ ఆ కలెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
మనం ఇందాకా చెప్పుకుంది రింకూ దుగ్గా గురించి. ఆమె కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. జనాలకు సేవ అందిస్తున్నారు. కానీ ఇటీవల చేసిన ఓ చర్యతో చేసిన మంచి పేరు పోయింది. ఢిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ ఇటీవల స్టేడియం నిర్వాహకులపై కలెక్టరమ్మ ఒత్తిడి తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల వరకు ప్లేయర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి.. కానీ వారిని ముందే బయటకు పంపించేశారు. ఏంటీ అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. రింకూ దుగ్గా, ఆమె భర్త సంజీవ్ ఖిర్వార్ వారి పెట్ డాగ్ కలిసి స్టేడియంలో ఈవినింగ్ వాక్ చేస్తున్నారు. కుక్క వాకింగ్ కోసం ప్రాక్టీస్ చేసే క్రీడాకారులను ముందే పంపించేశారు.
ఆ వీడియో షేర్ కావడం.. మీడియాలో వార్తలు రావడంతో దుమారం రేగింది. దీంతో రింకూ దుగ్గాను పోస్ట్ బూస్టింగ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రాథమిక నిబంధనలు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల మేరకు ఐఏఎస్ అధికారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ గవర్నమెంట్ ఉద్యోగి అయినా ముందస్తుగా పదవీ విరమణ చేయమని కోరే హక్కు ప్రభుత్వానికి ఉంది. కాగా రింకూ దుగ్గా భరత్ లడాఖ్‌లో పనిచేస్తుంటారు. కామన్‌గా ఐఏఎస్ అధికారులు ఆ ర్యాంగ్ ఉద్యోగులనే పెళ్లి చేసుకుంటారు. సో.. భార్య కొలువు పోయినప్పటికీ.. భర్త జాబ్ మాత్రం అలానే ఉంది. వీరికి.. జాబ్ లేదనే దిగులు కూడా ఉండదని మేధావులు అంటున్నారు.