»Smita Sabharwal Why Reservation For Disabled Smitas Comments That Became Controversial
Smita Sabharwal: దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు? వివాదస్పదంగా మారిన స్మితా వ్యాఖ్యలు
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వికలాంగులైన ఐఏఎస్ అధికారులు అన్ని పనులు చేయలేరంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ట్విట్టర్లో ఆమె చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను అనేక మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
Smita Sabharwal: Why reservation for disabled? Smita's comments that became controversial
Smita Sabharwal: ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారి పూజా ఖేడ్కర్ అబద్దాలు ఆడి ఐఏఎస్ అయింది. తప్పుడు పత్రాలను సమర్పించి యూపీఎస్సీ అధికారులు కళ్లు గప్పింది. యూపీఎస్సీ పరీక్షలు రాసి…వికలాంగుల కోటాలో ఉద్యోగం సంపాదించింది. కొన్ని రోజుల క్రితం వరకు ట్రైనింగ్‌లో ఉంది. ఆ సమయంలో ఆమె చేసిన ఓవరాక్షన్ …ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ మొత్తం చరిత్ర దేశ ప్రజలకు తెలిసిపోయింది. ప్రభుత్వం ఆమెకు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో దేశంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు. వికలాంగులకు అన్ని విభాగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించడం మంచిదేనా అనే టాపిక్‌పై తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఆలిండియా సర్వీస్ అధికారులకు ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుందని, వారందరికీ ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలని స్మితా సబర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రజలను కలిసే సమయంలో వారి సమస్యలు వినడానికి కొన్నిసార్లు గంటల పాటు ఫీల్డ్‌లో ఉండాల్సి వస్తుందని స్మితా సబర్వాల్ చెప్పుకొచ్చారు. ఇటువంటి సేవలు చేసే విభాగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు. అంతే కాకుండా మరికొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు. ఏదైనా విమానాయాన సంస్థ వికాలాంగుడిగా ఉన్న పైలెట్‌ను ఉద్యోగంలోకి తీసుకుంటుందా అని ప్రశ్నించారు. అదే విధంగా వికాలాంగుడైన సర్జన్‌ను నమ్మి .. పేషెంట్లు తమ ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ స్మితా సబర్వాల్ ప్రశ్నించారు.
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను కొందరు సమర్ధించారు. మరికొందరు తీవ్రంగా విమర్శించారు. యూపీఎస్సీ వంటి పరీక్షల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించిన కారణంగా మరి కొందరి మెరిట్ అభ్యర్ధుల అవకాశాలను కాలరాసినట్లే అవుతుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మన దేశంలో అమలౌతున్న రిజర్వేషన్ల విధానంలో ఎన్నో లొసుగులు ఉన్నాయని… వాటిని మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.