»Appointment Of Ias As Nodal Officers For Prajaa Palana
TS Congress: ప్రజాపాలన.. ఉమ్మడి జిల్లాలకు నోడల్ అధికారులు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కోసం ఐఏఎస్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తూ సీఎస్ శాంతకూమరి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో ఏ జిల్లాలకు ఏ ఆఫీసర్ ఉన్నారో చూద్దాం.
TS Congress: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కోసం ఐఏఎస్(IAS) అధికారులను నోడల్ అధికారులు(Nodal Officers )గా నియమిస్తూ సీఎస్ శాంతకుమరి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారిగా ఈ నియామకాలను చేపట్టారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతీ గ్రామంలో వార్డు సభల మీటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారు. నిజమైన అర్హులకు పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో పది మంది ఐఏఎస్ అధికారులను నియమించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.
ఉమ్మడి జిల్లాల వారిగా నియమించిన నోడెల్ అధికారులను ఒక సారి చూద్దాం.
హైదరాబాద్- కె. నిర్మల
నిజామాబాద్- క్రిస్టినా
కరీంనగర్- శ్రీ దేవసేన
మహబూబ్ నగర్- టీ.కె శ్రీదేవి
ఆదిలాబాద్- ఎం. ప్రశాంతి
మెదక్- ఎస్. సంగీత
నల్గొండ- ఆర్. వి కర్ణన్
వరంగల్- వాకాటి కరుణ
ఖమ్మం- ఎం. రఘునందన్ రావు
రంగారెడ్డి- ఇ. శ్రీధర్