UP Cadre IAS Officer Resign: సినిమా.. రంగుల ప్రపంచం.. అక్కడ నటించాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కొందరికే ఆ కల నెరవేరుతోంది. ప్రముఖుల పిల్లలు, బ్యూరోక్రాట్ల పిల్లలకు అవకాశాలు కాస్త ఈజీ అవుతాయి. అయితే వారు తమను తాము ఫ్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్యూరోక్రాట్‌కు సినిమా, మోడలింగ్, నటన అంటే ఇష్టం. చేసేది ఐఏఎస్ కొలువు అయినప్పటికీ మనసు తృప్తిగా లేదు. లాభం లేదనుకొని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
జాబ్- యాక్టింగ్
మనం ఇప్పటివరకు చర్చించుకుంది అభిషేక్ సింగ్ ( Abhishek Singh) గురించే.. ఇతను ఉత్తరప్రదేశ్ 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇతని భార్య శక్తి నాగ్ పాల్ కూడా ఐఏఎస్ అధికారి.. వీరిద్దరూ చక్కగా లైఫ్ లీడ్ చేయాల్సి ఉంది. కానీ నటన అంటే అభిషేక్‌కు ( Abhishek) ఇష్టం. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించారు. ఇన్ స్టాలో ఫాలొవర్లు కూడా ఎక్కువే.. 50 లక్షల మంది ఫాలొవర్లు ఉన్నారు. నటన, ఐఏఎస్ కొలువు రెండింటీలో దేనిని కొనసాగించాలనే అంశంపై మదన పడిపోయాడు.
ఫుల్ టైమ్ యాక్టర్
ఐఏఎస్ అధికారిగా పలు వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. డిప్యూటేషన్ పంపించడం.. సెలవులో ఉండటం లాంటి ఘటనలు జరిగాయి. దీంతో కొలువుకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఫుల్ టైమ్ యాక్టింగ్ చేస్తానని అంటున్నాడు. ఆయన చెప్పేది నిజమేనని.. ఐఏఎస్ జాబ్‌కు రాజీనామా చేశారని అధికారులు కూడా ధృవీకరించారు.
కాంట్రవర్సీ డెసిషన్స్
సర్వీస్‌లో ఉన్న సమయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. 2015లో యూపీ నుంచి ఢిల్లీకి డిప్యూటేషన్ మీద పంపించారు. దానిని మరో రెండేళ్లు పెంచారు. ఆ సమయంలో అభిషేక్ మెడికల్ లీవ్ తీసుకున్నాడ. తర్వాత 2020లో సొంత రాష్ట్రానికి పంపించింది. సరైన కారణం లేకుండా 3 నెలలు ఆలస్యంగా విధుల్లో చేరారు. గత ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్ వెళ్లాడు. ఎన్నికల పరిశీలకుడని తెలిసేలా కారు ముందు దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ఈసీ అతనిని విధుల నుంచి తప్పించింది. ఏడాది సస్పెండ్ చేసింది.
మొహనికి ఇక రంగే
విసిగి వేసారిన అభిషేక్ ఇక తనకు జాబ్ సూట్ అవదని డిసిషన్ తీసుకున్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేసి.. మొహనికి ఫుల్ టైం రంగు వేసుకోనున్నారు. ఐఏఎస్ కొలువు అంటే మాటలు కాదు.. ఓ జిల్లాకు బాస్.. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ.. ముందుకు సాగుతుంటారు. ఆ జాబ్ అంటే చాలా మంది ఇంపార్టెంట్‌గా భావిస్తారు. కానీ అభిషేక్ మాత్రం చాలా లైట్‌గా తీసుకున్నారు. అందుకే రిజైన్ చేసేశారు.