ఈసారి రావడం పక్కా.. బాక్సాపీస్ షేక్ చేయడం పక్కా అంటున్నారు గుంటూరు కారం మేకర్స్. అంతేకాదు.. ఫస్ట్ సాంగ్ కూడా రెడీ అవుతున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. అలాగే రిలీజ్‌కు వంద రోజులే ఉందని కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు.
Guntur Karam: అతడు, ఖలేజా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమాను 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. అయితే అనుకున్న దానికన్నా చాలా లేట్‌గా షూటింగ్ స్టార్ట్ అవడంతో.. అనుకున్న సమయానికి గుంటూరు కారం రిలీజ్ ఉంటుందా? అనే అనుమానాలున్నాయి. కానీ ఈ మూవీ, ఎంత డిలే అయినా సరే అనుకున్న టైంకి రిలీజ్ చేసి తీరుతాం అని.. మ్యాడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెప్పుకొచ్చాడు నిర్మాత నాగవంశీ. అలాగే 2024 జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ అవుతుంది.. ఈరోజు నుంచి వంద రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది అంటూ సాలిడ్ పోస్టర్‌తో మరోసారి కన్ఫామ్ చేశారు మేకర్స్.
ఇప్పటికే సంక్రాంతికి రావాలనుకున్న మిగతా సినిమాలు.. డైలమాలో పడిపోయినట్టే. నిన్న మొన్నటి వరకు మహేష్ వస్తాడో? రాడో? అని అనుకున్నవారంతా.. ఇప్పుడు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి వస్తున్నాం, రికార్డులు కొడుతున్నాం అని చెప్పిన నాగవంశీ.. మరోవైపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. దసరా కన్నా ముందే మాస్ సాంగ్ కాకుండా గుంటూరు కారం మెలోడీ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. థమన్ మ్యూజిక్ అందించిన ఆ సాంగ్ తివిక్రమ్-మహేష్‌లకి బాగా నచ్చిందట. త్వరలోనే లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నారు. ఇక శ్రీలీల మెయిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది.