ప్రస్తుతం చాలామంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. కొన్ని కంపెనీలు పెంపుడు జంతువులకు బీమా కల్పిస్తున్నాయి. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి చిన్నజాతి పెంపుడు జంతువులకు ఆరోగ్య రక్షణ కల్పించే ప్రత్యేక బీమాని పెట్ ఇన్సూరెన్స్ అంటారు.
Pet Insurance: ప్రస్తుతం చాలామంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. కుటుంబ సభ్యులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో.. వీటికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి సంరక్షణ, వైద్యం, ఆహారం కోసం లక్షలు వెచ్చిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు పెంపుడు జంతువులకు బీమా కల్పిస్తున్నాయి. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి చిన్నజాతి పెంపుడు జంతువులకు ఆరోగ్య రక్షణ కల్పించే ప్రత్యేక బీమాని పెట్ ఇన్సూరెన్స్ అంటారు. వీటి సంరక్షణకు నెలానెలా రూ.10 వేలు నుంచి రూ.54 వేలు ఖర్చు చేస్తారు. ఈ డబ్బును బీమా ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు.
దేశంలో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అస్యూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జంతు బీమాను అందిస్తున్నాయి. బీమా పాలసీకి సంబంధించి ఒక్కో కంపెనీ నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. కుక్క లేదా పిల్లికి బీమా ప్రవేశ వయస్సు 3 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు ఉండాలి. నిష్క్రమణ వయస్సు 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉండాలి. పెట్ ఇన్సూరెన్స్‌లో కుక్క చికిత్స సమయంలో శస్త్రచికిత్స, మరణాల ప్రయోజనం, థర్డ్ పార్టీ లయబిలిటీ కవర్.. అంటే మీ కుక్క ఎవరికైనా హాని కలిగిస్తే పరిహారం, కుక్కను కోల్పోవడం, దొంగతనం చేయడం వంటివి ఉంటాయి.
ఆ సమయంలో పాలసీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరికొన్ని సౌకర్యాలు కావాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీ కోసం మీరు ప్రీమియంగా రూ.4 వేలు చెల్లించాలి. డిస్కౌంట్ తర్వాత, మీరు ఈ పాలసీని రూ.2వేల నుంచి రూ.2,500కి పొందవచ్చు. కుక్కల బీమా కోసం ప్రీమియం వాటి జాతులను బట్టి మారుతూ ఉంటుంది.