గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.
FASTag: గతంలో టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులు మాన్యువల్‌గా టోల్ ఛార్జీలు చెల్లించేవారు. తర్వాత ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలు వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. ఫాస్టాగ్‌లు అనేవి ఎలక్ట్రానిక్ ట్యాగ్స్. వీటితో టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వాహనదారులు టోల్ ఛార్జీలు చెల్లించవచ్చు. ట్రాఫిక్ రద్దీ, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి 2016లో వీటిని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికీ లో-బ్యాలెన్స్ అలర్ట్స్, సాంకేతిక లోపాలు వంటి కొన్ని సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారంగా GPS ఆధారిత టోల్ సిస్టమ్ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది.
GPS ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు వంటి కొన్ని రహదారులపై పరీక్షిస్తున్నారు. ప్రత్యేక కెమెరాలతో కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను స్కాన్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఆ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో వర్క్ అవుతాయి. ఈ సిస్టమ్‌లో వెహికిల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ అమౌంట్ డెబిట్ అవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను దేశవ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.