NRML: భైంసా పట్టణంలో శుక్రవారం దుర్గామాత విగ్రహాలకు నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో తీసుకువచ్చి, పట్టణ ప్రధాన రహదారుల మీదుగా శోభాయాత్ర కొనసాగించారు. నృత్యాలు, కోలాటాలు, భక్తిగీతాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ శోభయాత్ర శనివారం ఉదయం వరకు కొనసాగింది.