NLG: మునుగోడు ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. “కాంగ్రెస్ పార్టీ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి కొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కాబోతున్నారు?” అంటూ.. అనుచరులు వాట్సాప్లో స్టేటస్లు, పోస్టర్లు పెడుతున్నారు.