JGL: వెల్గటూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి లక్షెట్టిపేటకు వెళ్తున్న కారు అతివేగంగా వెళ్లి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.