»El Salvador Fine 1000 Dollars From India And African Country Travellers
El salvador: భారత్ నుంచి వస్తే ఈ దేశంలో రూ.83 వేల ట్యాక్స్
మీరు ఎల్ సాల్వడార్ దేశం గుండా అమెరికా వెళ్తున్నారా? అయితే ఆగండి. ఎందుకంటే ఈ దేశం నుంచి అమెరికా వెళ్లే ప్రయాణికులపై ఎల్ సాల్వడార్ ప్రభుత్వం రూ.83 వేల ట్యాక్స్ విధిస్తుంది. అయితే ఈ పన్ను విధించడానికి ఓ కారణం కూడా ఉందని చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చుద్దాం.
el salvador fine 1000 dollars from india and african country travellers
సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్..భారతదేశం, ఆఫ్రికా నుంచి వారి దేశానికి వచ్చే ప్రయాణికులపై 1,000 డాలర్ల పన్నును వసూలు చేస్తోంది. భారత కరెన్సీలో దాదాపు రూ.83 వేలు వసూలు చేస్తుంది. అయితే అనేక మంది సెంట్రల్ అమెరికన్ దేశానికి వచ్చి అక్కడి నుంచి USకు వలసలు పోతున్నారని..వీటిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత పాస్ పోర్ట్ లేదా 57 ఆఫ్రికా దేశాల నుంచి ఎవరూ వచ్చినా కూడా ఇదే ట్యాక్స్ చెల్లించాల్సిందే.
అలా సేకరించిన డబ్బుతో ఆ దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుందని అక్కడి అథారిటీ తెలిపింది. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది వలసదారులు సెంట్రల్ అమెరికా మీదుగా USకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో VATతో సహా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి $1,130 కొత్త రుసుమును అక్టోబరు 23 నుంచి వసూలు చేస్తున్నారు. 2023 సెప్టెంబర్ తో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరికి అమెరికా వ్యాప్తంగా 32 లక్షల మంది అక్రమ వలసవాదులు ఉన్నట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ విభాగం గుర్తించింది. పోర్టులు, ఎయిర్ పోర్టులు సైతం అక్రమ వలసవాదుల సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటించింది. తాజాగా విధించిన పన్ను వ్యాట్ తో కలిపితే మొత్తం 1,130 డాలర్లు (రూ.93,790).