చైనా మాజీ ప్రధాని లీ కియాంగ్ (Lee Kiang) (68) గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం షాంఘైలో నివసిస్తున్న ఆయనకు గురువారం అకస్మాత్తుగా గుండె పోటు (Heart attack) వచ్చింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. జిన్‌పింగ్ సర్కారులో పదేళ్లు ప్రధానిగా పనిచేసిన ఆయన ఈ ఏడాది ఆరంభంలో పదవిని కోల్పోయారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో ఆయన అత్యంత శక్తివంతమైన నేతగా పేరు పొందారు. లీ కియాంగ్ మృతి పట్ల చైనీయులు (Chinese) విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. లీ కియాంగ్ చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఓ స్థానిక అధికారి ఇంట్లో జన్మించారు. 1955లో అనుహువై ప్రావిన్సులోని డింగ్యువాన్ కౌంటీలో జన్మించారు.
అన్ని దశల్లో ఆయన పనిచేశారు. చాలా చిన్న వయసులోనే గవర్నర్(Governor)గా ఎదిగారు. పోలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో కూడా ఆయన చిన్నవయసులోనే చేరారు. మాజీ దేశాధ్యక్షుడు హు జింటావో(Hu Jintao)స్థాయికి లీ కియాంగ్ చేరుకుంటారని ఓ దశలో ఊహాగానాలు వినిపించాయి.హు జింటావో అండదండలు లీ కియాంగ్ కు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యేయి. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన పార్టీ నుంచి తొలిగే వరకు పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ(Standing Committee)లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్ధిక విధానాల్లో లీ కియాంగ్ నిర్ణయాలు చాలా సూక్ష్మంగా ఉండేవి. సంపన్నులు, పేదల మధ్య గ్యాప్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. ప్రతి ఒక్కరికీ హౌజింగ్ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడిపారు.